కినపర్తి గ్రామంలో సంవత్సరం గడిచిన అందని ఉపాధి నిధులు
అడ్డతీగల, పెన్ పవర్
అడ్డతీగల మండల పరిధిలో గల దొరమామిడి పంచాయితీ లోని కినపర్తి గ్రామస్తులు ఉపాధి నిమిత్తం ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కి సంబంధించిన పని డబ్బులు సంవత్సరం గడిచిన రాని పరిస్థితి..వివరాలలోకి వెలితే జనవరి-2020 న ఉపాధి నిమిత్తం , గడవని పరిస్థితులలో పనికి వెళ్లిన ఆ ఊరి ప్రజలకు ఆ గ్రామ బి పి యమ్ అయిన కరుణా గారు, పాస్ పుస్తకాలు బతికించాలంటూ కొన్ని నెలలు, ఈ రోజు రేపు అంటూ ఒక్క కినపర్తి లొనే సంవత్సరం గా 4.50 లక్షల వరకు ఇవ్వని పరిస్థితి నెలకొంది..డ్యూటీ కి రాకపోవడం, ఫోన్ కి సైతం స్పందించక పోవడం, ఊరి ప్రజలకు సైతం పోస్టాపీస్ నుండి వచ్చే కాల్ లెటర్ నుండి ఇన్సూరెన్స్ కాగితాలు వరకు సమయం దాటిన కొన్నాళ్ల తర్వాత ఇవ్వడం జరుతుందని, కొన్ని సార్లు అయితే ఇవ్వటం లేదని వాపోతున్నారు. అడుగుదామని వెళ్లిన ఏరోజు డ్యూటీ కి వచ్చిన దాఖలాలు లేవని సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపోతున్నారని అడిగితే ఈరోజు సెలవు పెట్టానని రేపు వస్తానని ఎల్లుండు వస్తానని చివరకి రావటం లేదన్నారు.దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కినపర్తి గ్రామ ప్రజలకు అందటం లేదని ఇలా అయితే లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన మాకు డబ్బులు రాలేక, ఉపాధి పనులకు వెళ్లలేక, దిక్కు తోచని మమ్మల్ని ఆదుకోవాలని పత్రిక ముఖంగా అధికారులను, రాజకీయ నాయకులను విన్నవించుకున్నారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా, చిన్నచూపు ధోరణితో, బాధ్యత రాహిత్యంగా ఉన్న ఈ ఉద్యోగిపై సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బాధాకర హృదయంతో కోరడం జరిగింది.
No comments:
Post a Comment