Followers

వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ లో ప్రచారం

 వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ లో ప్రచారం

మంచిర్యాల , పెన్ పవర్

నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలో మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థి ఆడెపు నాగార్జునను గెలిపించాలని వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేసి ప్రజలకు తెలియజేశారు. మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమ ఫలితమే ఇవాళ వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ పెంపుదల జరిగిందని, వృద్ధులకు వితంతువులకు రెండు వేల రూపాయలు వికలాంగులకు 3వేల రూపాయలు ఇస్తున్నారంటే అంటే మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమ ఫలితమే మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే భవిష్యత్తులో ఆసరా పింఛన్లు 6 వేల రూపాయలు ఇస్తామని ప్రజలకు తెలియజేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలంటే మందకృష్ణ మాదిగ బలపరిచిన ఆడెపు నాగార్జున గారిని గెలిపించాలని పేద ప్రజల కష్టాలు తెలిసినవాడు స్థానికుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వికలాంగులు పేదలు మహాజన సోషలిస్టు పార్టీకి మద్దతు ఇవ్వాలని  తెలియజేశారు. ఈ  కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఎల్ గోపాల్ వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు షణ్ముఖ రావు, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు అందే రాంబాబు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జనగామ జిల్లా అధ్యక్షులు కుమార్, వికలాంగుల పోరాట సమితి నాగార్జునసాగర్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్, సభ్యులు పెద్ద పెళ్లి సత్యనారాయణ, నాగరాజు, ఎమెసేఫ్ మహిళా నాయకురాలు రేణుకా, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా నాయకురాళ్లు, మంగమ్మ, ఇంద్ర చౌదరి, స్నేహలత చౌదరి, సైదమ్మ  జంగే టి మమత, ఎమెసేఫ్ నాయకుడు మురళి ఎమ్మార్పీఎస్ హాలియా పట్టణ నాయకుడు సైదీసు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...