వడ్డాది రోషిణి కి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ 37వార్డ్ ఎగువ రెల్లి వీధి లో నివసిస్తున్న 20సం"రాల వయస్సు గల పెళ్లి కాని అమ్మాయి కుమారి వడ్డాది రోషిణి, బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నదని అక్కడ వైస్సార్సీపీ నాయకుల ద్వారా తెలియజేసిన వెంటనే స్పందించి సొంత నిధుల నుండి ₹.10,000/- లను మందులకొరకు ఆర్థిక సహాయం చేశారు. తదుపరి మెరుగైన వైద్యం కొరకు న్యూరో ఫిజిసియన్ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్ తో మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మాయి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి,ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తనని సంప్రదించవచ్చునని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో 37వార్డ్ కార్పోరేటర్ చెన్నా జానకిరామ్,30వార్డ్ కార్పోరేటర్ కోడూరు అప్పలరత్నం,30వార్డ్ ప్రెసిడెంట్ దసమంతుల మాణిక్యాలరావు,సత్యనారాయణ, చిన్ని,కాశారపు వాసు,డేవిడ్ రాజు,రామరాజు,కొండమ్మ, రామలక్ష్మి వైస్సార్సీపీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment