ముడసర్లోవ పార్క్ కి మహర్దశ....
అరిలోవ, పెన్ పవర్
ముడసర్లోవ పార్కు అభివృద్ధి, ఆధునీకరణ కొరకు 50 కోట్ల నిధులు కేటాయింపు జివిఎంసి కౌన్సిల్ మొట్టమొదటిగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో పార్క్స్ అభివృద్ధి పనులకు మేయర్ ఆమోదం తెలియజేశారు జీవీఎంసీ పరిధిలో గల సుమారు 20 ఎకరాల లో విస్తరించిన ముడసర్లోవ పార్క్ విశాఖ నగర ప్రజలకు మరియు ఇతర ప్రాంతాల వారికి, పర్యాటక ప్రాంతంగా నెలకొని ఉంది.ఆ ఒక్కటి అడక్కు. స్వర్ణకమలం. మరోచరిత్ర. కళ్ళు. నాలుగు స్తంభాలాట. మొదలగు అనేక చిత్రాలు విశాఖ వేదికగా గతంలో చిత్రీకరణ చేసేవారు, ప్రకృతి అందాలకు నెలవైన విశాఖలో గల ప్రాంతాల్లో ముడసర్లోవ పార్క్ఒకటి చుట్టూ పచ్చని కొండలు కొండలు మధ్యలో రిజర్వాయర్ పూర్తిగా వర్షాధారం కావడం పర్యాటకులకు ప్రకృతి ప్రేమికులకు, వివిధ రకాల పక్షులకు, అనేక జీవరాశులకు ఆధారం ఈ పార్క్.. నగర ప్రజల దాహార్తిని తీర్చే ప్రధాన రిజర్వాయర్లో ఇది ఒకటిగా ఉంది దశాబ్దాల కాలంగా ఈ పార్కు పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకుంది పార్కు అభివృద్ధి కొరకు వీఎంఆర్డీఏ సుమారు 45 కోట్ల రూపాయలు తో ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ వివిధ కారణాల వలన ప్రారంభానికి నోచుకోలేదు .
పెరుగుతున్న నగర ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలు పర్యాటకులకు ఒక మంచి ఉద్యానవనం అందించుటకు ముడసర్లోవ పార్క్ ను అభివృద్ధి చేయుటకు కౌన్సిల్ ఆమోదం తెలపడంతో నగర మేయర్ చొరవతో పార్కు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 13 వ వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత మాట్లాడుతూ ముడసర్లోవ పార్కు అభివృద్ధికి తన హయాంలో 50 కోట్ల రూపాయలు కేటాయించడం పై హర్షం వ్యక్తం చేశారు పార్కు అభివృద్ధితోపాటు ఈ ప్రాంతం ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారని స్వచ్ఛమైన గాలి పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పార్కు నిర్మాణనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పార్కులను అభివృద్ధి చేయుటకు సహకరించిన అధికార గణానికి తోటి కార్పొరేటర్లకు మేయర్ హరి వెంకట కుమారి. కి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
No comments:
Post a Comment