శిక్షణ పూర్తి అయిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ
ఎటపాక మండల కేంద్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం భాగంగా శిక్షణ పూర్తి అయిన మహిళలకు చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆకుల.వెంకటరమణ చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐటీడీఏ పీవో మాట్లాడుతూ...ఐటీడీఏ చింతూరు,ఏపీ.ఎస్.ఎస్.డిసి మరియు శ్రీ భవిత ఎడ్యుకేషనల్ సిల్క్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఎటపాక వై టి సి లో నిర్వహించిన అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు 29 కుట్టుమిషన్లు అందజేశారు ఇందులో భాగంగా ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ డిజైన్ కు అత్యంత ప్రాముఖ్యత ఉందని తెలియజేశారు యువత వృత్తి నైపుణ్య కోర్సు నేర్చుకుని జీవితంలో ముందుకు సాగాలని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా సిల్క్ డెవలప్మెంట్ అధికారి.హరి శేషు,ఎటపాక వై టి సి మేనేజర్ శేఖర్ ముల్లి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment