రేషన్ షాప్ ప్రారంబించిన ఎమ్మెల్యే మైనంపల్లి, సివిల్ సప్లే చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పెదలకు చేరాలి - ఎమ్మెల్యే
పెన్ పవర్, మల్కాజిగిరి
గౌతంనగర్ డివిజన్ జెఎల్ఎస్ నగర్ లోని నూతనంగా రేషన్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సివిల్ సప్లే మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నర్సింహ్మ రెడ్డి కలిసి రేషన్ షాప్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జెఎల్ఎస్ నగర్ లో గతంలో రేషన్ షాప్ లేక ఇబ్బందులు ఎదురుకుంటున్నామని స్దానిక కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకరవడంతో వేంటనే స్పందించి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రేషన్ షాప్ నూతనంగా ఏర్పాటు చేయాలన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ నర్సింహ్మ రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పందించి రేషన్ షాప్ ఏర్పాట్ల పై పూర్తి సహకరం అందించి కాలనీలో ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించారని, వారికి ఆభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,రాముయదవ్, జిఎన్.వి. సతీష్ కుమార్, సత్యనారాయణ, ఉపేందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment