Followers

పొగాకు, గుట్కా పై అవగాహన

 పొగాకు, గుట్కా పై అవగాహన...

-జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్

అదిలాబాద్ ,  పెన్ పవర్ 

జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల పరిసరాల్లో పొగ తాగడం, గుట్కా నమిలి ఉమ్మడం నిషేదమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని రైతు బజార్, నేతాజీ చౌక్, గాంధీ చౌక్ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ పొగ త్రాగడం, గుట్కా నమలడం వల్ల కాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని, పొగత్రాగడం లాంటి అలవాట్లు ఉన్నవారిలో కరోనా మూలంగా ప్రమాద తీవ్రత పెరుగుతుందని తెలిపారు. కార్యాలయాల సిబ్బందితోపాటు ఇతరులు నిబంధనలు పాటించాలని, లేకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వారితో వెంట చిరంజీవి, దామోదర్, ఆశన్న ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...