మన్నేటికోట లో కరోనా పై అవగాహన ర్యాలీ..
మండల పరిధిలోని మన్నేటికోట గ్రామపంచాయతీలో కరోనా పై అవగాహన ర్యాలీ గ్రామ సర్పంచ్ పి.బసవయ్య నాయుడు, పంచాయతీ కార్యదర్శి జయశంకర్, వీఆర్వో వెంకటాద్రి, ఆధ్వర్యంలో గురువారం ర్యాలీలో ముఖ్య అతిథులుగా తాసిల్దార్ కె సంజీవ్ రావు, ఎంపీడీవో టీ రవికుమార్ , డాక్టర్ కే శ్రీనివాసరావు, పాల్గొని. సర్పంచ్ మాట్లాడుతూ కరోనా పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, కరోనా సెకండ్ వే లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని మరణాల సంఖ్య తిరుగుతూ ఉంది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మన గ్రామంలో మనకు మనమే జాగ్రత్తలు పాటిస్తూ కరోనా మహమ్మారి తరిమికొడదాం అందరం అధికారుల సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తూ మాస్కు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్ వాడుతూ, 45 సంవత్సరాలు పైబడిన వారు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కరోనాపై జాగ్రత్తలు పాటిస్తూ మన గ్రామాన్ని మనం కాపాడుకుందాం, ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, వాలంటీర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment