చిన్నారులను హింసించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి
గౌడ సంక్షేమ సంఘం మహబూబాద్ జిల్లా కన్వీనర్ బూరుగు శ్రీకాంత్ గౌడ్
తొర్రూర్, పెన్ పవర్తెలిసి తెలియక మామిడి కాయలను తెంపిన, చిన్నారులను హింసించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని, గౌడ సంక్షేమ సంఘం మహబూబాద్ జిల్లా కన్వీనర్ బూరుగు శ్రీకాంత్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భముగా శనివారం మహుబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశములో ఆయన మాట్లాడుతూతెలిసీ తెలియక చేసిన చిన్నపాటి పొరపాటుకు చిన్నారులకు పెద్ద శిక్ష విధించడం సరైందికాదన్నారు. ఉద్దేశ పూర్వకం గానే మామిడి తోట కాపలాదారులు చిన్నారులపై దాడులకు తెగబడ్డారన్నారు. నేర స్వభావం కలిగి ఉండటం వల్లే చేతులు విరిచి, నోట్లో పశువుల పేడ కుక్కి, పాశవికంగా హింసించారన్నారు. అమాయక పిల్లలు దెబ్బలకు తాళలేక వదిలేయమని, కాళ్ళమీద పడి వేడుకున్నా వదలకుండా కర్రలతో బాదారన్నారు. దాడికి పాల్పడిన బానోతు యాకూబ్, బానోతు రాములు తోపాటు దాడికి ఉసిగొల్పిన మరో ఇద్దరిని సైతం అరెస్టు చేయాలన్నారు.చిన్నారుల పై దాడి పై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిందితులందరికీ కఠిన శిక్ష పడేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు మరల పునరావృతం కాకుండా, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు పోలీసు అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు రాజు కుమార్ గౌడ్,వడ్లకొండ కర్ణాకర్ గౌడ్, లింగాల మురళి కృష్ణ గౌడ్, బూరుగు వీరభద్రయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment