విశ్రాంత ఉద్యోగి తోట నాగభూషణం గుప్తా మృతి
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన తోట నాగభూషణం గుప్తా (75 ) శనివారం రాత్రి కరోనా వ్యాదితో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో మృతిచెందారు. నాగభూషణం గుప్తా గత రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా అతని కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. కాగా నాగభూషణం గుప్తా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు.అతనికి భార్య చంధ్రకళ .కుమారులు శ్రీ నివాస్ గుప్తా. నాగరాజు గుప్తా. మళ్లీఖార్జన్ గుప్తాలున్నారు. అతని శవాన్ని అంబులెన్స్ లో అతని పెద్ద కుమారుడు శ్రీ నివాస్ గుప్తా కారులో అతని కుటుంబ సభ్యులు ఆటోలో గిద్దచెరువు లోనీ శ్మశానవాటికకు ఆదివారం ఉదయం చేరుకోగా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆద్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి. గన్న బాల్ రెడ్డి. చెటుకూరి కృష్ణమూర్తి గౌడ్ .లు స్థానికు ల సహాయం తో కాడు పేర్పించి సిద్దంచేయగా సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలకు చెందిన ఇద్దరు సిబ్బంది పి.పి.ఇ కిట్స్ ధరించి వచ్చిశవాన్నీ కాడుపై చేర్చి నిప్పంటించి దహాణసంస్కారాలు నిర్వహించారు. కరోనా కారణంగా నాగభూషణం గుప్తా శవం అందరు ఉన్న అనాద శవంగా దహాణసంస్కారాలు అందుకుంది.ఇటువంటి పరిస్థితి శత్రువుల కు కూడా రావద్దు అంటూ కుటుంబ సభ్యులు భోరున విలిపించారు. కరోనా కారణంగా స్థానిక వైశ్య సామాజిక వర్గం తోట నాగభూషణం గుప్తా దహాణసంస్కారాలకు దూరంగా ఉండవలసి వచ్చింది.
No comments:
Post a Comment