Followers

సిర్సన్నా లో ఎల్ఈడీ కాంతుల వెలుగులు

 సిర్సన్నా లో ఎల్ఈడీ కాంతుల వెలుగులు...

 ఎల్ఈడీ బల్బుల కాంతులతో ఆదా అవుతున్న విద్యుత్ బిల్లులు 

 బేల, పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్నా లో ఎల్ఈడీ కాంతుల పట్టణ తరహాలో వెలుగులు చిమ్ముతున్నయి. గ్రామ సర్పంచ్ గోదురు భూమన్న, ఉపసర్పంచ్ జ్యోతి దీపక్ గౌడ్ వినూత్నంగా ఆలోచిస్తూ ప్రగతి పనులు చేపడుతున్నారు. గ్రామం ఆకర్షణీయంగా కనిపించేలా వారు ప్రత్యేక చొరవ తీసుకొని స్తంభాలకు ఎల్ఈడి దీపాలను అమర్చారు. దీంతోపాటు కంభం పై నుంచి సగం వరకు వెలుతురు నిచ్చే ప్రత్యేక తీగలను కొనుగోలుచేసి గ్రామంలోని స్తంభాల చుట్టూ అమర్చారు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులు వెదజల్లడం తోపాటు స్థానికులు రహదారుల పై చెత్త వేయడం మానేశారని, గ్రామ పంచాయతీకి వచ్చే విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయని వారు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...