రాష్ట్ర ప్రభుత్వం పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలి ..
రోడ్డు పై ధర్నా చేస్తున్నా రైతులు
గంభీరావుపేట, పెన్ పవర్రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాపనగర్ గ్రామం లో బుధవారం రోడ్డు పై రైతుల ధర్నా చేశారు. రైతులు ఆరు కాలం శ్రమించి కష్టపడ్డ ఫలితం లేకుండా పోయిన పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్డెక్కిన రైతులకు మద్దతుగా ముందుకు వచ్చి న బారతీయ జనతా పార్టీ నాయకులకు రైతులు తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో బిజెపి జిల్లా అధికార ప్రతినిది ప్రసాద్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షుడు గంట అశోక్, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంత్ యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, మండల అధ్యక్షులు కోడే రమేష్ , ఓ బి సి మోర్చా మండల అధ్యక్షులు మేకర్తి శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు దేవేందర్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు ప్రత్తి స్వామి, శేఖర్ యాదవ్, పర్శరాములు యాదవ్, బండ దేవయ్య, రాజా రమేష్, వెంకట్రావు, నరేష్ బిజెపి నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment