Followers

ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్

 ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్

సీసియర్ సిటిజన్లు, గర్భిణీలకు అత్యవసర పరిస్థితుల్లో సేవలు

హెల్ప్‌లైన్ నంబర్ 9490617234తో సేవలను వినుయోగం 




పెన్ పవర్, మల్కాజిగిరి 

నాన్ కొవిడ్ ఎమ‌ర్జెన్సీ సేవ‌ల నిమిత్తం ఉచిత అంబులెన్స్ స‌ర్వీసుల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ బుధ‌వారం ప్రారంభించారు. టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడర్ స్మార్ట్ఐఎంఎస్‌ ఉచిత అంబులెన్స్సేవలను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ వైద్య పరీక్షలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు రోజులో ఎప్పుడైనా ఈ సేవలను ఉచితంగా పొంద‌వ‌చ్చ‌న్నారు.  ఆక్సిజన్, వెంటిలేషన్, ఇతర అత్యవసర సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌లను అందిస్తున్నాయి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, వికలాంగులు ఈ సేవలను ఆసుపత్రులు, రోగనిర్ధారణ కేంద్రాలు, బ్ల‌డ్ బ్యాంకుల‌ను సందర్శించేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చని అన్నారు. రాచకొండ కమిషనరేట్ ప‌రిధిలో వచ్చే రెండు నెలలు ఈ అంబులెన్సులు క్రీయాశీల‌కంగా అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు చెప్పారు. కొవిడ్ -19 నుండి ప్ర‌జ‌లు తమను తాము రక్షించుకోవడా నికి మాస్కు ధరించడం,శానిటైజర్‌ను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల ని కోరుతున్న‌ట్లు వెల్ల‌డించారు. నాన్ కొవిడ్ -19 వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు రాచకొండ కొవిడ్ కంట్రోల్ హెల్ప్‌లైన్ నంబర్ 9490617234 ను సంప్రదించవచ్చు అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవలను పొందటానికి స్టాన్‌ప్లస్ హాట్‌లైన్ నంబర్ 1800 – 121911911 ను సంప్రదించాల్సిందిగా సూచించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...