Followers

వైద్య శాఖలో ఆక్రమ డిప్యుటేషన్ లు రద్దు చేయాలి

 వైద్య శాఖలో  ఆక్రమ డిప్యుటేషన్ లు రద్దు చేయాలి 

జిల్లా వైద్య అధికారులు నియంతృత్వ పోకడలు మానుకోవాలి    

విధానాలు మార్చుకోకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేస్తా    

కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి  
పెన్ పవర్, కందుకూరు

డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో పరిధిలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి ఇక్కడ వైద్య సిబ్బందిని ఒంగోలు కు బదిలీ చేయడం పై స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి శనివారం ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బందిని సంపూర్ణంగా మౌలిక వసతులను ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందేనన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా వస్తుందని ప్రభుత్వం  అధికారులను అప్రమత్తం చేస్తూ  కేంద్రమును ఒప్పించి వ్యాక్సిన్ ఆరు లక్షల డోసులను తెప్పించగా జిల్లాకు 25 వేల డోసులను సరఫరా చేశారని అన్నారు. ఇందులో ప్రకాశం జిల్లా దీనికి భిన్నంగా నడుస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కందుకూరు నియోజకవర్గంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ పరిధిలో ఉన్న సిబ్బందిని  అధికశాతం లో  ఒంగోలుకు డిప్యూటేషన్ గా విచ్చలవిడిగా ఎందుకు బదిలీ చేస్తున్నారు అని ఇక్కడ కొరత ఉన్నప్పటికీ మీకు ప్రజల ఆరోగ్యం ఎవరికీ పట్టదు అని నిలదీశారు. డిప్యుటేషన్ లకు కేరాఫ్ అడ్రస్ గా డి ఎం హెచ్ వో కార్యాలయం భారీ ఎత్తున డిప్యుటేషన్ లకు తెర తీశారని అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే పై స్థాయి కూడా తీసుకు వెళతానని అన్నారు. డిఎం హెచ్ఓ, కలెక్టర్ స్పందించకపోతే వారి కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తానని అన్నారు. జిల్లా కలెక్టర్ కనుసన్నల్లో డిఎం హెచ్ వో కార్యాలయం నడుస్తుందని కలెక్టర్  స్పందించక పోతే  కలెక్టర్ కార్యాలయం ముందు కూడా నిరసన తెలియజేస్తానని కరాఖండిగా చెప్పారు. ఎవరి ఇళ్లవద్ద వారికి ఉద్యోగాల కోసం డేప్యూటేషన్స్ ఇస్తున్నారని ఈ తాపత్రయం వెనక ఏముంది, ఈ తాపత్రయం వెనక లక్ష్మీదేవి కాలి గజ్జలు గల్లుమంటున్నాయని ప్రజలు మమ్మల్ని నేరుగా అడుగుతున్నారని అన్నారు. డిఎం హెచ్ ఓ, కలెక్టర్ కలుగజేసుకొని డిప్యూటేషన్ రద్దు చేయాలన్నారు. ఆశ వర్కర్ల కొరత ఉన్నప్పటికీ ఆశా వర్కర్లు రూరల్ నుంచి అర్బన్ కు ఎందుకు పంపిస్తున్నారని అర్బన్ లో వారికి ఇచ్చిన సంఖ్య కంటే అధికంగా ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారని నిలదీశారు. అధికారులు పొరపాటును సరిదిద్దుకోవాలని మంచి ఆశయంతో ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెడ్డపేరు తీసుకు రాకుండా అధికారులు చర్యలు తీసుకొని డిప్యూటేషన్ రద్దు చేయాలని మహీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...