మాస్క్ దరిద్దాం.. కరోనాను తరిమేద్దాం అంటూ జైపూర్ పోలీసుల ప్రచారం
మంచిర్యాల , పెన్ పవర్
మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ సెంటర్ నందు ప్రతి వారం ఏర్పాటు చేసే వార సంత నందు జైపూర్ పోలీస్ లచే మాస్క్ మీద అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి. ఎవ్వరు కూడా అనవసరంగా బయట తిరగకుండా అవసరమైన సమయంలో మాత్రమే బయటకి రావాలి బయటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాస్కు ధరించే రావాలి. తరుచూ శానిటైజ్ చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయటి నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఏది ముట్టు కోకుండా, మీ చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్లాలి. మాస్కులు ధరించని వారిపై 188 ఐపిసి 51(బి) డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్* ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించోద్దని మరొకసారి ప్రజలందరికి జైపూర్ పోలీసుల తరుపున విజ్ఞప్తి చేశారు.
.
No comments:
Post a Comment