Followers

పారిశుద్ధ్య కార్మికులకు ఎమర్జెన్సీ కిట్ల పంపిణీ...

 పారిశుద్ధ్య కార్మికులకు ఎమర్జెన్సీ కిట్ల పంపిణీ...

ఆదిలాబాద్ ,  పెన్ పవర్

కరోనా విపత్తు సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు అభినందనీయ మని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని పురపాక కార్యాలయం లో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు ఎమర్జెన్సీ కిట్ల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కార్మికులకు ఎమర్జెన్సీ కిట్లను అందించి.. కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనా కల్పించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ... పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక భూమిక పోషించే పారిశుద్ధ్య కార్మికులు కరోనా బారిన పడకూడదన్న ఉద్దేశంతో కిట్లను పంపిణి చేసినట్లు పేర్కొన్నారు. మాస్కులు, గ్లౌస్ లు, సానిటైజేర్ ఇతరత్రా వస్తువులను కిట్ లో పొందుపరిచినట్లు వెల్లడించారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి అంత్యక్రియలను సైతం పురపాలక కార్మికులు జరుపుతున్నారని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కమీషనర్ శైలజ, అసిస్టెంట్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, కౌన్సిలర్ సంద నర్సింగ్, నాయకులు కొండ గణేష్, మోబిన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...