Followers

పార్టీలకు అతీతంగా అభివృద్ధి

 పార్టీలకు అతీతంగా అభివృద్ధి

అభివృద్ధికి అందరూ సమానమే

ప్రమాణస్వీకారోత్సవం లో నూతన సర్పంచ్లు

పాచిపెంట,పెన్ పవర్

  అభివృద్ధికి అందరూ సమానమేనని, పార్టీలకతీతంగా అభివృద్ధి చేపడతామని  కొటికిపెంట, కేసలి నూతన సర్పంచులు ఇజ్జాడ అప్పలనాయుడు, ఎస్ నిర్మల ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా పంచాయతీ కార్యదర్శులు సర్పంచుల తో ప్రమాణ స్వీకారం చేయించగా, వైస్ సర్పంచు, మెంబర్ల తో సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి అనేది అందరికీ సమానమేనని ఓట్లు వేసినా, వేయకపోయినా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత మాపై ఉందని పేర్కొన్నారు. విద్య, వైద్యం,త్రాగునీరు,  రహదారుల సౌకర్యం, ఉపాధి హామీ పథకం  అమలు చేసే విధానంపై ప్రత్యేక దృష్టి సారించి పంచాయతీ ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని సర్పంచులు ఇరువురు పేర్కొన్నారు. పంచాయతీ లో గల గ్రామాల అన్నింటిలో తరచూ పారిశుద్ధ్యం పనులు చేపట్టి ఏ ఒక్కరికి అనారోగ్య సమస్య రాకుండా చూస్తామని తెలియజేశారు. భీమా మిత్ర,, పింఛన్లు, తదితర అంశాలపై లబ్ధిదారులకు ఎల్లవేళలా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తామన్నారు. పంచాయితీ లో ఏ సమస్యలు ఎదురైనా బాధితులు తమ వద్దకు వచ్చి సమస్త చెబితే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. కొటికిపెంట సర్పంచు అప్పలనాయుడు వార్డ్ మెంబరలందరికీ ప్రత్యేకంగా పలకరించి ఎటువంటి మొహమాటం పడకుండా  సమస్యలు చెబితే పరిష్కరిస్తామన్నారు. అలాగే కర్రీ వలస, గురువు నాయుడుపేట, తదితర పంచాయతీల్లో సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు.పాచిపెంట మండలం కేసలి నూతన సర్పంచ్ నిర్మల తను ప్రమాణ స్వీకారోత్సవం చేసిన సందర్భంగా150 మంది స్కూలు విద్యార్థులకు స్టీలు కంచాలు,  స్టీలు గ్లాసులు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పంచాయితీ  పెద్దలు నూతన సర్పంచ్ ను అభినందించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...