Followers

కరోనా పట్ల ప్రజలు ఆధైర్య పడవద్దు

 కరోనా పట్ల ప్రజలు ఆధైర్య పడవద్దు

కోవిడ్ బాధితులకు అండగా నిలవాలి.

ఖానాపురం గ్రామ సర్పంచ్ చెట్టుపల్లి ఉమారాణి సోమయ్య.

తొర్రూరు, పెన్ పవర్

కోవిడ్ బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం  ఎంతైనా ఉందని, మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఖానాపురం గ్రామ సర్పంచ్ చెట్టుపల్లి ఉమారాణి సోమయ్య అన్నారు.గురువారం గ్రామ సర్పంచ్ చెట్టుపల్లి ఉమారాణి సోమయ్య ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు మాంసం, పౌష్టికాహారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... రోజు వారీగా పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్‌ను నియంత్రించే అవకాశముందని, చెప్పారు. ప్రతి రోజూ శరీరానికి అవసరమైన మోతాదులో పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చునని, తెలిపారు. పండ్లు, కూరగాయాలు, పాలు, మాంసకృతు ల వంటి వాటిని తీసుకుంటే మంచిందన్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేక అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారని, పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చీకటి శ్రీధర్ గౌడ్,  పంచాయతీ కార్యదర్శి నూరుద్దీన్,వార్డు సభ్యులు,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...