తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి
పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి.
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి సి.హెచ్.వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్. జిల్లా యస్.పి:
తిరుపతి, పెన్ పవర్
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు తిరుపతి జిల్లా పోలీస్ వారితో పాటు కేంద్ర బలగాలతో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. 3 నియోజకవర్గ పరిధిలో (తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు) దాదాపు 372 పోలింగ్ లొకేషన్లు, 782 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఉప ఎన్నికల్లో ప్రతి యొక్క పోలింగ్ కేంద్రంలో పకడ్బందీగా సి.సి కేమరాలను ఏర్పాటుచేసి వాటిని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసందానం చేసి నిరంతర పర్యవేక్షణలో ఉండేటట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ కేంద్ర బలగాలు (సి.ఐ.యస్.యఫ్, సి.ఆర్.పి.యఫ్)తో ప్రత్యేకమైన భద్రత కల్పించడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న సిబ్బందితో పాటు స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు మరియు ప్రత్యేకమైన క్విక్ రియాక్షన్ టీం లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద అనుకోని అవాంచనీయ సంఘటనలు జరిగినప్పుడు సమాచారం అందిన వెంటనే రెండు మూడు నిమిషములో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను చక్కద్దిద్దే ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలుపారు.
జిల్లాలో రేపు జరగబోవు పార్లమెంట్ ఉప ఎన్నికలకు పటిష్ట బందోబస్తు. పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాం. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి. పోలింగ్ జరిగే లొకేషన్ల పరిసరాలలో పరిస్థితులు సమీక్షించేందుకు రంగంలో ప్రత్యేక బలగాలు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలలో కేంద్ర భలగాలచే ప్రత్యేక భద్రత. పోలింగ్ జరుగు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ & 30 పోలీస్ యాక్టులు అమల్లో ఉంటాయి. ఓటు వేసిన అనంతరం ప్రజలు ఆయా పరిసరాలలో గుంపులుగా గుమిగూడకుండా నేరుగా ఇళ్లకు వెళ్లాలి. ఓటరు కాని వారు, స్థానికేతరులు పోలింగ్ రోజున ఉండరాదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నియమ నిబంధనలు పక్కాగా అమలులో ఉంటాయి. ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఎవరైనా ఆటంకపరిచినా... ప్రలోభాలకు గురి చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు. గొడవలు, అల్లర్లకు దిగి కేసుల్లో ఇరుక్కోకండి. చట్టాన్ని అతిక్రమించడం... చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం నేరం. పుకార్లు, వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు. నీళ్ల బాటిళ్లు, ఇంకు సీసాలు, బాల్ పెన్నులు, మొబైల్ ఫోన్లు, తదితర విలువైన వస్తువులేవి పోలింగ్ కేంద్రాలలోకి అనుమతి లేదు. ఏదైనా సమస్య వస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. ఎన్నికల నిర్వహణకు ఆటంకపరిచినా... శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు. పోలింగ్ కేంద్రాల వద్ద కావలసిన బ్యారికేట్ మరియు క్యు లైన్ ఏర్పాటు చేసుకోవాలి. పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ గీత తప్పని సరిగా వేయించాలి. ఈ 100 మీటర్ల లోపల పార్టీలకు సంబందించిన గుర్తులుగానీ, బ్యానర్లుగానీ, మరియు లౌడ్ స్పీకర్లు ఉన్నాయో లేదా క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నయెడల వాటిని తొలగించాలి. పోలింగ్ కేంద్రం దగ్గర సి.సి కెమరాలు, బాడీ వొర్న్ కెమరాలు, డ్రోన్ కెమరాలు పనిచేస్తున్నాయో లేదా అని కూడా పరిశీలించుకోవాలి. పోలింగ్ కేంద్రంలో ఏదైనా చిన్న సంఘటనలు జరిగినా వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలి. పోలింగ్ విధులు నిర్వహించు సిబ్బంది అందరికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. పోలింగ్ విధులలో ఉన్న సిబ్బంది అందరి దృష్టి పోలింగ్ బాక్స్ పైనే ఉండాలి. క్యు లైన్ లో వచ్చు ఓటర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించాలి. పోలింగ్ రోజున ఘటనలుగానీ, అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా డయల్ –100 లేదా జిల్లా పోలీస్ ఎన్నికల కంట్రోల్ రూం నంబర్ 63099 13960 లేదా పోలీస్ వాట్సాప్ 80999 99977, వీటికి సమాచారం అందించి సహకరించాలని జిల్లా యస్.పి తెలిపారు. ప్రతి ఒక్కరు కష్టపడి ఈ ఎన్నికలను కూడా విజయవంతం చేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకోస్తారని ఆకాంక్షిస్తున్నానని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు తెలిపారు.
No comments:
Post a Comment