Followers

నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకం

 నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకం: డిసిపి వెంకటేశ్వర్లు

కూకట్ పల్లి, పెన్ పవర్

కూకట్ పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్ లోని ఆంజనేయనగర్ లో తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అరవైనాలుగు సీసీ కెమెరాలను శనివారం డిసిపి వెంకటేశ్వర్లు, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈసందర్భంగా డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాలనీలోని భద్రత కోసం కాలనీ వాసులు అందరూ కలిపి సీసీ కెమెరాలు పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయమని, అదేవిధంగా పోలీసు సిబ్బందికి కూడా నేరల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహధపడతాయని అన్నారు. కిడ్నప్ కేసులు, దొంగతనాల కేసుల విచారణలో సిసి కెమెరాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయని, అలాగే కాలనిలో ఎవరైన అనుమానాస్పదంగా కనిపించిన సరే సిసి కెమెరాల సహాయంతో అలాంటి వారిని ముందుగానే గుర్తించి నేరాలు జరగకుండా అడ్డుకట్ట వేయొచ్చని అన్నారు. ఈకార్యక్రమంలో కూకట్ పల్లి ఏసీపి సురేందర్ రావు, కూకట్ పల్లి సిఐ నర్సింగ్ రావు, సెక్టర్ ఎస్.ఐ బాను ప్రసాద్, డివిజన్ కార్పొరేటర్ శిరీష బాబురావు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...