కోవిడ్ నిబంధనలు పాటించాలి..
పట్టణ సీఐ వెంకటేష్..
వేములవాడ, పెన్ పవర్
ఆటో డ్రైవర్ లు కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని వేములవాడ పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో స్థానిక తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న క్రమంలో ఆటో డ్రైవర్లు ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆటో లో ఎక్కే ప్రయాణికులు ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించి, దూరం పాటించే విధంగా చూసుకోవానే బాధ్యత డ్రైవర్ దేనని గుర్తు చేశారు. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నియంత్రణ కు సహకరించాలని లేనిచో విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తప్పవని, ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
No comments:
Post a Comment