ఎన్నికల నియమావళిని తుచతప్పకుండా పాటించాలి
పెన్ పవర్,పెద్దాపురం
ఎంపిటిసి, జడ్పీటీసులు పోటీలో ఉన్న అభ్యర్థులు అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తుచతప్పకుండా అనుసరించాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో రమణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెద్దాపురం ఎంపీడీవో కార్యాలయంలో పెద్దాపురం మండలంలో పోటీ చేస్తున్న ఎంపీటీసీ ,జడ్పిటిసి అభ్యర్థులకుసమావేశం పెద్దాపురం మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమంలోమండల అసిస్టెంట్ టర్నింగ్ అధికారి ఎంపిడిఓ రమణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకుఅభ్యర్థులు,ఎన్నికలఅధికారులుఎన్నికలమార్గదర్శకాలను పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ అబ్జర్వర్ చిరంజీవి నియమావళి మానిటరింగ్ సిబ్బంది రఘుపతి, శ్రీనివాస్ సమావేశం లో మాట్లాడుతూ తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఏజెంట్లు, వివిధ రకాల ఫారాలు, బ్యాలెట్ పేపర్లు తదితరాలపై అవగాహన కల్పించారు. ఫొటో గుర్తింపు కార్డులు, ఇతర అంశాలపై వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ ఆర్ ఓ (ఎంపీడీవో) రమణా రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను శాంతియుత వాతావరణంలో విజయవంతంగా పూర్తిచేసేందుకు అభ్యర్థులు సహకరించాలని కోరారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పర్యవేక్షణకు కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని,. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే లౌడ్‌స్పీకర్లకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. వాహనాల వినియోగానికి అనుమతులు తీసుకోవాలని తెలిపారు, అదే విధంగా సమావేశాలు, ర్యాలీలకు పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. కరపత్రాలు వంటి వాటిని ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు రిటర్నింగ్ అధికారికి దృష్టికి తీసుకురావచ్చని ఎంపీడీవో వివరించారు.ఏప్రిల్ 8 పోలింగ్ ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 5గం. వరకు పోలింగ్ జరుగుతుందని, కౌంటింగ్ ఏప్రిల్ 10 ఉదయం 8గంటలు ప్రారంభిస్తారని ఏఆర్‌వో వెల్లడించారు. ఈ సమావేశం లో అభ్యర్థులు వెలిబుచ్చిన సందేహాలను ఏఆర్‌వో రమణా రెడ్డి నివృత్తి చేశారు.. ఈ కార్యక్రమంలో జోనల్ ఆఫీసర్ అప్పారావు వీరబాబు అప్పలరాజు రూట్ అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment