Followers

సంక్షోభంలో కూడా సంక్షేమం ఆపని ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం

సంక్షోభంలో కూడా సంక్షేమం ఆపని ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం

జగనన్న పాలనకు మద్దతు ఇవ్వండి

వై.సీ.పి యం.పీ.టీ.సి,జడ్.పీ.టీ.సి అభ్యర్థులను గెలిపించండి

ప్రచారంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి ప్రజా నీరాజనాలు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్


కురుపాం మండలంలోని వివిధ పంచాయతీలలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యం.పీ.టీ.సి,జడ్.పీ.టీ.సి లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల.పుష్పశ్రీ వాణి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రికి హారతులతో ఆహ్వానించి నీరాజనాలు పలికారు.వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి కురుపాం నియోజకవర్గం కంచుకోటాగా ఎల్లప్పుడూ ఉంటుందని తెలుపుతూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిద సంక్షేమ పధకాలను ప్రజలకు స్పష్టంగా వివరించారు.కరోనా వంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోలేక అగ్రరాజ్యాలు కూడా వెనగడుగు వేసినప్పటిటీ సంక్షోభంలో కూడా ఏ ఒక్క నెల వెనగడుగు వేయకుండా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం వై.యస్.జగనన్న పాలిస్తున్న వై.సీ.పీ ప్రభుత్వమని గర్వంగా చెప్తున్నానన్నారు.గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ పరిపాలన సాగించారని గత అసెంబ్లీ ఎన్నికలకు కూడా పసుపు, కుంకుమ పేరుతో ప్రతీ మహిళకు ఎన్నికలకు 6నెలల ముందు 10వేల రూపాయలను ఇచ్చి బ్యాంకుల చుట్టూ తిప్పించి మళ్ళీ మోసం చేసి గద్దె ఎక్కలని కుట్ర పన్నాడని  అందుకే ఇప్పుడు వెతికిన దొరకని విధంగా ప్రజలు తీర్పును ఇచ్చారని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ప్రతీ అర్హులకు లబ్ది చేకూరే  విధంగా పాలనను సాగిస్తున్నారని గత ప్రభుత్వంలో లంచాల పరంపర కొనసాగేదాని ఆధార్,రేషన్ కార్డులు కూడా లంచం ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిరకుండా వచ్చేవి కావని కానీ ప్రస్తుత జగనన్న ప్రభుత్వంలో మీ ఇంటిదగ్గర కూర్చొని గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా పనుల్ని చేయించుకునే వెసులుబాటు కల్పించారని అన్నారు.రైతులకోసం, మహిళల కోసం, బడుగుల కోసం,విద్యార్థులకోసం,వితంతువులకోసం,ప్రజల ఆరోగ్యము కోసం,పరిశ్రమల ప్రగతి కోసం ఆలోచించి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టింన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని కనుక జగనన్న ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఫ్యాను గుర్తుకు ఓటేసి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...