అర్హులైన వారికి రైతు భరోసా
సీతారాంపురం, పెన్ పవర్
మండలం లో రైతు భరోసా రుసుము పై మండల వ్యవసాయ అధికారి జోగి గణేష్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మండలంలో రైతు భరోసా రుసుము కు అర్హులైన వారు బ్యాంకు ఖాతాల్లో రుసుము పడినట్లయితే మీ సంబంధిత వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని తెలిపారు.మీ సమస్యను అర్జీ పూర్వకంగా సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరారు. వారు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తారన్నారు .ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
No comments:
Post a Comment