ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవు
ఉపాధి హామీ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీవో గౌస్
తొర్రూరు, పెన్ పవర్ఉపాధి హామీ పనులను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని, ఎంపీఓ గౌస్ తెలిపారు. గురువారం మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ పోసాని పుష్పలీల సంతోష్ తో కలిసి ఎంపీవో గౌస్ పరిశీలించారు. చెరువు పూడిక తీత పనులను త్వరితగతిన చేపట్టాలని, సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల అమల్లో మండలాన్ని ఆదర్శంగా నిలపాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉందని, తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలులో గ్రామ పంచాయతీలు క్రీయాశీల పాత్ర పోషించాల ని, పంచాయతీల ఆదేశాల మేరకు పనుల గుర్తింపు, అమలు జరగాలన్నారు. గ్రామ సభ ఆమోదించిన పనులనే చేపట్టాలని, పంచాయతీ కార్యదర్శులు పనుల పై పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీపై ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం, నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం, చెరువుల పునరుద్ధరణ, పంట కాల్వలు, నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శ్మశానాలు, మరుగుదొడ్లు, వంట గదులు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాల వంటి పనులు చేపట్టాలన్నారు. ఉపాధి కల్పించే వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వచ్చే హరితహారంలో భాగంగా చింత, వేప చెట్లను విరివిగా నాటి వాటి సంరక్షణలో సర్పంచులను, కార్యదర్శులను భాగస్వాములను చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నూతన మార్గదర్శకాల అమలులో భాగంగా బయోమెట్రిక్ విధానంలో కూలీల నమోదు, మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైన అంశాలను తప్పక చేపట్టాలని, సూచించారు. ఉపాధిహామీ పథకంలో అవినీతి చోటుచేసుకుంటే కఠిన చర్యలుంటాయని, హెచ్చరించారు. ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని, అన్నారు. రైతులకు పశువుల కొట్టాలు, చేపల చెరువులు ఉపాధి హామీ కింద ఉచితంగా తవ్విస్తామని, తెలిపారు. పల్లెల్లోని విభిన్న ప్రతిభావంతులకు 150 రోజుల పనిదినాలు కల్పిస్తామని, వివరించారు. తీగజాతి కూరగాయలు పండించేందుకు రాయితీపై పందిళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మునగతోట ఏర్పాటు చేసుకునేందుకు రైతులను ప్రోత్సహిస్తామని, పేర్కొన్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులు సొంతంగా దుకాణం, కూరగాయల వ్యాపారం, గాజుల దుకాణం వంటివి ఏర్పాటు చేసుకొనేందుకు వీలుందని, ఎవరైనా ముందుకు వస్తే అవకాశం కల్పిస్తామని వివరించారు. నర్సరీ లోని ప్రతి మొక్క మొలకెత్తేలా చూడాలని ,పూలు పండ్ల మొక్కలు విరివిగా నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment