కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలు ఒక వరం...
ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్
బేల, పెన్ పవర్కెసిఆర్ ప్రభుత్వం అమలుపరుస్తున్న షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు ఆడపడుచులకు ఒక వరమని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మనోహర్ అన్నారు.మండల కేంద్రంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న గొప్ప కానుక కళ్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఠాక్రె వనిత గంబీర్, ఆడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్యం ప్రమోద్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు వాడ్కర్ తేజ రావు, విపిన్, సుధాకర్ విట్టల్ వరడే, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నారాయణ, గీత, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment