ఉద్యోగాలు సాధించిన ఆస్పరెన్స్ అకాడమీ విద్యార్థులు
మంచిర్యాల, పెన్ పవర్ఇటీవలే విడుదలైన సింగరేణి ఉద్యోగా ఫలితాల్లో స్థానిక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆస్పరెన్స్ అకాడమీ నుండి 05గురు విద్యార్థులు ఉద్యోగులుగా ఎంపికైనారు. విజయం సాధించిన వారిలో ఎస్.రాజకుమార్,ఎస్.వినోద్ కుమార్,ఎం.శ్రీధర్, వి.సతీష్ కుమార్,జి.శరత్ కుమార్ లు ఉన్నారు.వీరిని శాలువతో సన్మానించారు. తొలి ప్రయత్నంలొనే విజయం సాదించడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపికైన వారు పేర్కొన్నారు. సామాజిక సేవ అనే ఆంశంతో,పేదలకు కోచింగ్ ఇవ్వవడానికే ఆస్పరెన్స్ అకాడమీ ఉందని డైరెక్టర్ నిహార్ వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పరెన్స్ అకాడమీ డైరెక్టర్ నిహార్ వర్మ, ఉపాధ్యాయులు శ్రీకాంత్, సాయి కృష్ణ, గోపి, వేణు, రవీందర్ లు మరియ విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment