లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం
మందమర్రి, పెన్ పవర్లోక్ అదాలత్ ల ద్వారా కేసులను పరిష్కరించకుంటే సత్వర న్యాయం చేకూరుతుందని మందమర్రి పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10 శనివారం మంచిర్యాల జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. లోక్ అదాలత్ కార్యక్రమాల గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని, లోక్ అదాలత్ లో న్యాయమూర్తులు ఇరువర్గాల సమస్యను రాజీ మార్గంలో పరిష్కరిస్తారని, పై కోర్టుకు వెళ్లే సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు. మందమర్రి పోలిస్ స్టేషన్ పరిధిలో నమోదైన పిట్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులతో పాటు సివిల్, నష్ట పరిహారం కోసం దాఖలైన కేసులను పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరచు కోగలరని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment