కె.కె .ఓ .సి. పి లో భూములు కోల్పోయిన వారి పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలి
కాసిపేట మండలం కే .కే .ఓ .సీ .పీ లో వందల ఎకరాల భూములు కోల్పోయి జీవనోపాధి లేకుండా పోయిందని భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని త్వరితగతి న నష్టపరిహారం ఇవ్వాలని అదే విధంగా మా పిల్లలను ఉద్యోగాలలో చేర్చుకోవాలని వ్యవసాయ భూములు కోల్పోయిన నిర్వాసితులు కోరుకుంటున్నారూ. సర్పంచ్ సాపాట . శంకర్ మాట్లాడుతూ భూమి కోల్పోయిన వారికి ఇప్పటివరకు నష్ట పరిహారం రాలేదని, జీవో నంబర్ 32 ప్రకారం భూమి కోల్పోయినటువంటి భూ నిర్వాసితుల పిల్లలను స్థానికులుగా గుర్తించి ఓ. బి. సి కాంట్రాక్టర్ వారికి ఉద్యోగాలు కల్పించాలి. అలా కాకుండా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా బయటి వ్యక్తులను డ్రైవర్లు గా మెకానికల్గా అనేక విభాగాల్లో తీసుకుంటూ స్థానికుల కు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సార్లు జి.ఎం, ని పి.ఓ ,నీ కలిసి లిఖిత పూర్వకంగా భూ నిర్వాసితుల పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలని కోరాం. అని సర్పంచ్ శంకర్ అన్నారు.
No comments:
Post a Comment