ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలి
తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్
తార్నాక, పెన్ పవర్
ప్రైవేట్ టీచర్స్ కి ఏవిధంగానైతే నెలకి రెండు వేల రూపాయలు 25 కిలోల బియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చేసినటువంటి లెక్చరర్స్ కి కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్టా శేఖర్ కోరారు. డిగ్రీ కాలేజ్ సెమిస్టర్ సిస్టం వచ్చిన తర్వాత ప్రైవేటు యాజమాన్యాలు చాలా దోపిడికి గురి చేస్తున్నాయి ఒక నెలలో సిలబస్ మొత్తం చెప్పించుకుని పంపిస్తున్నారు అవసరమైతే ఇంకా 10 రోజులలోనే సిలబస్ కంప్లీట్ చేయమని చెబుతున్నారని, దీని వలన మేనేజ్మెంట్ లకు లాభం చేకూరుతుంది కానీ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు ఇచ్చిన విధంగా ప్రవేట్ లెక్చరర్స్ కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని దీనిపైన అధికారులు ఆలోచించి ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే జీతభత్యాలను చూసి, ప్రభుత్వం ఆదుకోవాలని డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ లెక్చరర్స్ కోరారు.
No comments:
Post a Comment