స్వచ్చందంగా దేవాలయాల మూసివేత
పెన్ పవర్, మందమర్రికొవిడ్ రెండవ వెవ్ కారణంగా రోజు రోజుకు పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని ఆలయాలను శనివారం నుండి స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు పట్టణ అర్చకుల సంఘము ప్రకటించింది.శనివారం వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శనివారం సాయంత్రం నుండి ప్రజలకు అలయాలల్లో దర్శనాలు నిలిపివేయడం జరుగుతుందని కేవలం ఆలయ పూజారులు మాత్రమే పూజలు నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ప్రజలు ఎవరు కూడా ఆలయాలకు రావద్దని నేటినుంచి తీర్ధ ప్రసాదాలు, పూజలు నిర్వహించబోమని భక్తులు తమ తమ ఇంటిలోనే ఉండాలని వారు కోరారు. మాలలు వేసుకున్న స్వాములు అందరూ కూడా తమ ఇంటిలోనే ఉండి పూజలు చేసుకోవాలని వారు కోరారు. మే ఒకటి నుండి పెళ్లి ముహూర్తలు ఉన్నందున అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తక్కువ మందితో శుభకార్యాలు చేసుకోవాలని వారు కోరారు. ఈసమావేశంలో గోవర్ధనగిరి ఆనంతాచారి,నర్సింహచారి,శ్రీధరా చారి,వెంకటాచారి,జగదేశ్వరాచారి,సోనాల్ శర్మ,హరి లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment