Followers

మురిసిపోయిన నిజాయితీ

 మురిసిపోయిన నిజాయితీ 

  మానవత్వానికి నిలువుటద్దం పొట్నూరు గణేష్ 

 20 తులాల బంగారం ,ఆస్తి పత్రాలు పోగొట్టుకొన్న హైదరాబాద్ మహిళా 

 దొరికిన బంగారం బ్యాగును పోలీసుల సమక్షంలో బాధితురాలికి అందజేత 

 గణేష్ కి  పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలు

స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం 

విశాఖపట్నం, పెన్ పవర్

పక్కనోడు ఏమరుపాటుగా ఉంటే చాలు వాడి జేబులో సొమ్ములు కాజేసే మాయగాళ్లు ఉన్న కాలం ఇది. అలాంటిది రోడ్డు మీద ఏకంగా లక్షల విలువజేసే బంగారం దొరికితే ఇంకేమైనా ఉందా చటుక్కున తీసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోదామనే వాళ్లే ఎక్కువగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఓ జర్నలిస్ట్ నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచాడు. లక్షల విలువజేసే బంగారం ,ఆస్తి పత్రాలతో కూడిన బ్యాగును పోగొట్టుకొన్న ఓ బాధితురాలి కన్నీళ్లు తుడవడంతో నిజాయితే మురిసిపోయింది. మానవత్వమే పరిమళించేలా నిజాయితీని ప్రదర్శించిన జర్నలిస్ట్ పొట్నూరు గణేష్ కి పోలీస్ ఉన్నతాధికారులు ప్రశంసించగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అడ్డదారుల్లో సంపాదించే వాళ్ళు ,మోసాలు చేసి కూడబెట్టే వాళ్ళు, ఎదుటోడిని బురిడీ కొట్టించి వెనకేసుకొనే వాళ్ళు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో పరాయి సొమ్ము పాము వంటిది అనే సూక్తికి కట్టుబడి రోడ్డు మీద దొరికిన 20 తులా బంగారం ,లక్షల విలువజేసే ఆస్తి పత్రాల బ్యాగును పోగొట్టుకొన్న బాధితులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు ఒక జర్నలిస్ట్ వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కి చెందిన ఆర్ .మోహిని అనే మహిళా కుటుంబంతో కలసి కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం వెళ్లారు. తిరిగి హైదరాబాద్ వెళ్ళడానికి రైలు టిక్కెట్స్ బుక్ చేసుకొని అవి రద్దు కావడంతో విశాఖ నగరంలోని మధురవాడ ,స్వతంత్రనగర్ లో ఉన్నటువంటి తమ బంధువుల ఇంటికి వచ్చి గురువారం షిరిడి సాయి నాద్  ట్రైన్ లో హైదరాబాద్ చేరుకొనుటకు అన్నీ సిద్ధం చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ కు వెళ్ళకెందుకు ఆటోలో  జనరల్ లగేజీ తో పాటు 20 తులా బంగారం ,ఆస్తి పత్రాలతో కూడిన బ్యాగును కూడా  ఉంచి పయనమైయ్యారు. మార్గం మధ్యలో ఆటోలో నుండి బంగారం కలిగిన బ్యాగు స్వతంత్రనగర్ లో పడిపోయింది.ఆ బ్యాగు జర్నలిస్ట్ పొట్నూరు గణేష్ కి దొరికింది. పాపం ఎవరిదో బ్యాగు పడేసుకొన్నారనీ,వారి వివరాలు తెలుసుకొని అందజేద్దామని బ్యాగును తెరిచి చూస్తే అందులో 20 తులాల బంగారం ,ఆస్తి పత్రాలు ,బ్యాంకు పుస్తకం కనిపించాయి. దీంతో బ్యాంక్ పుస్తకం ఆధారంగా బ్యాంక్ అధికారులను సంప్రదించి హైదరాబాద్ కు చెందిన మహిళ ఫోన్ నెంబర్ ను కనుకొన్నాడు. ఇదిలా ఉంచితే హైదరాబాద్ వెళ్ళడానికి రైల్వేస్టేషన్ లో ఆటో దిగిన మహిళా బంగారం బ్యాగు ఆటోలో కనపడకపోవడంతో ఒక్క సారిగా కన్నీరుమున్నీరైంది. కంటతడి పెట్టుకొంటూ పోలీసులను ఆశ్రయించింది పోయిన బ్యాగును కనిపెట్టే క్రమంలో ఈస్ట్ సబ్  డివిజన్ క్రైమ్ సిఐ సింహాద్రి నాయుడు ఆదేశాల మేరకు టూటౌన్ క్రైమ్ ఎస్సై ఎన్ .వి. భాస్కరరావు ,ఫోర్త్ టౌన్ కానిస్టేబుల్ బి.మురళీకృష్ణ ఆటో డ్రైవర్ ను పిలిచి విచారిస్తున్న సమయంలో బాధితురాలికి జర్నలిస్ట్ గణేష్ నుండి ఫోన్ వచ్చింది పోగొట్టుకొన్న బ్యాగు తనకు దొరికినట్లు చెప్పడంతో ఆమె ఒక్క సారిగా ఊపిరి పీల్చుకొంది అనంతరం పోలీసుల సమక్షంలో బంగారం ,ఆస్తి పత్రాలను  హైదరాబాద్ కు చెందిన మోహిని చేతికి అందజేసి జర్నలిస్టు గణేష్ నిజాయితీని చాటుకొన్నాడు.

 ఎస్ సి ఆర్ డబ్ల్యూ  ఏ ఆధ్వర్యంలో గణేష్ కు సత్కారం :

 గణేష్ లాంటి జర్నలిస్టు తమ అసోసియేషన్ సభ్యుడు కావడం గర్వకారణమని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం  ఎస్సిఆర్డబ్ల్యూ ఏ ప్రధాన కార్యాలయంలో జర్నలిస్టు పవర్ బ్యూరో చీఫ్ ,మధురవాడ కళింగ వైశ్య సంఘం సెక్రెటరీ ,మధురవాడ వర్తక సంఘం జాయింట్ సెక్రెటరీ పొట్నూరు గణేష్ కు దుశ్శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. బాధ్యతగల పౌరుడిగా వ్యవహరించారంటూ గణేష్ ని అసోసియేషన్ సభ్యులు  పొగడ్తలతో ముంచెత్తారు. గణేష్ ని ఆదర్శంగా తీసుకోవాలని అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ఎస్సిఆర్డబ్ల్యూ ఏ కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్ యాదవ్ ,ఇతర కార్యవర్గ సభ్యులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...