అత్యవసర వేళల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలి
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి , పెన్ పవర్బెల్లంపల్లి పట్టణంలోని ప్రజలు అందరు అత్యవసరంగా ఉంటేనే బయటకు రావాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం 6, 24వ వార్డుల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తున్న సందర్భంగా ప్రజలెవరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, ఏమైనా సమస్యలుంటే నేరుగా తనకు తెలియచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు దామెర శ్రీనివాస్, మాటూరి మధు, నాయకులు గడ్డం బీమాగౌడ్, మల్లయ్య, వినయ్, తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment