ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరి
గుడివాడ, పెన్ పవర్
ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. సోమవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఉయ్యూరుకు చెందిన సుద్దపల్లి హెప్సిబా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3గా కాంట్రాక్ట్ పద్దతిన 2018 వ సంవత్సరం నుండి పనిచేస్తున్నానని తెలిపారు. కొన్ని కారణాలతో తనను విధుల్లోకి రాకుండా నిలిపివేశారన్నారు. దీనికి సంబంధించిన ఫైల్ పౌరసరఫరాల శాఖ ఎండీ కార్యాలయంలో పెండింగ్ లో ఉందని చెప్పారు. తన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించేలా చూడాలని మంత్రి కొడాలి నానిని కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ ఎండీతో మాట్లాడతానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ నియామకాలు జరిగేవన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, ఏ ప్రభుత్వ శాఖలో ఉద్యోగికైనా రాష్ట్ర ఆర్ధికశాఖే జీతాలను చెల్లిస్తుందని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు
No comments:
Post a Comment