Followers

ఏకశిలా రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుబాష్ రెడ్డి

 ఏకశిలా రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుబాష్ రెడ్డి

వినుయోగదారులకు నాణ్యమైన ఆహరం, సరసమైన ధరలకు అందించాలి - ఎమ్మెల్యే

ఇసిఐఎల్ లో పసందైన రాయలసీమ రుచులు


పెన్ పవర్,  మల్కాజిగిరి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ నియోజకవర్గం  చర్లపల్లి  డివిజన్  ఈసీఐఎల్ చౌరస్తా లో  శుక్రవారం ఏకశిలా మల్టీ క్యూషన్ రెస్టారెంట్(రాయలసీమ రుచులు), బంక్విట్ హాల్ ను ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డ, మాజీ పార్లమెంట్ సభ్యులు సముద్రాల వేణుగోపాలచారి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల్ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ  నాణ్యమైన ఆహారం సరసమైన ధరలకు అందించి ప్రజల మెప్పు పొందాలని ఆకాంక్షించారు.  ఏకశిలా రెస్టారెంట్ యజమాని బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రీతి లోకేష్ రెడ్డి లు మాట్లాడుతూ ఈసీఐఎల్ ప్రజలకు పసందైన రాయలసీమ రుచులకు ఏకశిలా రెస్టారెంట్ లో రాగిముద్ద, నాటుకోడి పులుసు, తలకాయ మాంసం, పాయ మొదలగు ప్రత్యేక రాయలసీమ వంటకాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, కాప్రా సర్కిల్ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి రామ్మోహన్, జెర్రీ పోతుల  ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి దన్ పాల్ రెడ్డి, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, పాజ్జురి పావని మణిపాల్ రెడ్డి, టిఆర్ఎస్  సీనియర్ నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, సోలిస్ ఆస్పత్రి యజమాని రామాంజనేయులు, నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, బైరి రామ్ చందర్ గౌడ్, కొత్త అంజిరెడ్డి, బేతాళ బాల రాజు, నేమురీ మహేష్ గౌడ్,  జోనడ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...