Followers

జమ్మిగడ్డ, కుషాయిగూడ స్మశాన వాటికల అభివృద్ధికి కృషి...మేయర్

 జమ్మిగడ్డ, కుషాయిగూడ స్మశాన వాటికల అభివృద్ధికి కృషి...మేయర్


పెన్ పవర్ , కాప్రా

ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, జమ్మిగడ్డ స్మశానవాటిక అభివృద్ధికి కృషి చేస్తానని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హామీ ఇచ్చారు. సోమవారం డివిజన్ పరిధిలో మేయర్.ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  పర్యటించారు. ఈ సందర్భంగా ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మేయర్  విజయలక్ష్మి మాట్లాడుతూ కుషాయిగూడ స్మశాన వాటిక తో పాటుగా , జమ్మిగడ్డ స్మశాన వాటికలో  అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాధిక దమ్మాయిగూడ రోడ్ లో గణపతి గుడి సమీపంలో నాలా కబ్జా చేసి నిర్మించిన అక్రమాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఏఎస్ రావు నగర్ డివిజన్ ను  రాజకీయాలకతీతంగా అభివృద్ధి కి కృషి చేస్తానని మేయర్ తెలిపారు.  ఈసందర్భంగా కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి పలు సమస్యలను పరిష్కారం కోసం మేయర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో  కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, పావనిరెడ్డి, టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మానవ హక్కుల పరిరక్షణ కమిటీ ఉప్పల్ అధ్యక్షులు తాడూరి జగన్ కుమార్, టిఆర్ఎస్ నాయకుడు కాసం మహిపాల్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...