Followers

హైపోక్లోరయిడ్ ద్రావణం పిచికారీ....

 హైపోక్లోరయిడ్ ద్రావణం పిచికారీ.... 

పెన్ పవర్, విజయనగరం

 కరోనా రెండవ దశ నియంత్రణ, నివారణ చర్యలో భాగంగా నగర వీధులలో భారీ ఎత్తున హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసినట్లు ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం బెల్ మిస్టర్ అనే భారీ వాహనంతో ఏకకాలంలో అధిక మొత్తం హైపోకోరైడ్  ద్రావణం పిచికారీ చేసే ప్రక్రియను స్థానిక గంటస్తంభం వద్ద ప్రారంభించినట్లు చెప్పారు.కరోనా రెండోదశ వ్యాప్తి తీవ్రమవుతున్న దృష్ట్యా  ప్రజారోగ్య విభాగం నగరంలో అనేక ప్రాంతాలలో ద్రావణాన్ని పిచికారి చేస్తోంది. ప్రధాన వీధు లతోపాటు కరోనా కేసులు అధికంగా ఉన్నా చిన్న ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా, చేతిపంపులు ద్వారా ద్రావణాన్ని పిచికారి చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. అయితే నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలు ప్రాథమిక నివారణలో భాగమేనని, వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. కచ్చితంగా మాస్క్  ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. వైరస్ సోకిన వ్యక్తి పట్ల వివక్ష ఉండకూడదని, కేవలం జాగ్రత్త మాత్రమే పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య పర్యవేక్షకులు సాల్మన్ రాజు, అంజిబాబు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...