నౌపడ వైద్య సిబ్బంది పై కరోనా కాటు
సంతబొమ్మాళి, పెన్ పవర్
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించిన నౌపడ పి హెచ్ సి ఫార్మసిస్ట్ కి కరోనా కాటేసింది. మండలంలో రోజురోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం నౌపడ పీహెచ్సీలో 190 మందికి వ్యాక్సినేషన్, 13 మందికి కరోనా పరీక్షలు, బోరుభద్ర లో 210 మందికి కరోనా వ్యాక్సిన్, 37 మందికి కరోనా పరీక్షలు, దండుగోపాల పురం లో 170 మందికి వ్యాక్సినేషన్, 20 మందికి కరోనా పరీక్షలు, మండల కేంద్రం సంతబొమ్మాళి లో 44 మందికి వ్యాక్సినేషన్ 81 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
మండలంలో బోరుభద్ర, నౌపడ పి హెచ్ సి పరిధిలో పలువురికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. నౌపడ పీహెచ్సీ లో తహసీల్దార్ రాంబాబు వ్యాక్సినేషన్, కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రక్రియను పరిశీలించారు. ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ ను గుర్తించి కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అయితే నౌపడా పీహెచ్సీలో ఫార్మసిస్ట్ కు పాజిటివ్ రావడంతో తోటి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అవుతారు కనుక సిబ్బంది కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని వైద్య సేవలందిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం తెలియజేశారు. అలాగే పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారికి మండలంలో నాలుగు పీహెచ్సీల వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లి, ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి మందులను అందజేస్తున్నారు.
No comments:
Post a Comment