ముగిసిన అభివృద్ధి కమిటీల శిక్షణ
మెంటాడ, పెన్ పవర్స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో అంగన్వాడీల అభివృద్ధి కమిటీ సభ్యులు శిక్షణ శనివారంతో ముగించారు. ఈ శిక్షణలో నాడు డు- నేడు అంగన్ వాడి కేంద్రాలు అభివృద్ధి పనులను అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వము ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు చేపట్టాలని సెక్టార్ సూపర్వైజర్లు రమాకుమారి, హైమావతి అభివృద్ధి కమిటీలకు శిక్షణ, అవగాహన కల్పించారు. ఈ శిక్షణ, అవగాహన కార్యక్రమానికి అసిస్టెంట్ ఇంజనీర్, మహిళా పోలీస్ కార్యదర్శి తదితరులు హాజరు కావాల్సి ఉండగా, వారు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన లేదు. సెక్టార్ సూపర్వైజర్ రమాకుమారి మాట్లాడుతూ ప్రస్తుతము కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
అంగనవాడి కార్యకర్తలు, ఆయాలు, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆమె సూచించారు. మరో సూపర్వైజర్ హైమావతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే విధంగా కమిటీలు ముందుకు వచ్చి చర్యలు చేపట్టేలా ఉండాలని ఆమె పేర్కొన్నారు. అలాగే కరోనా టీకాలు ప్రతి ఒక్కరికి వేయించేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆమె సూచించారు. గ్రామాల్లో కూడా అంగన్వాడి కార్యకర్త, ఆశా వర్కర్లు, మహిళా ఆరోగ్య కార్యకర్త కోవిడ్ -19 పై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యవంతులను సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment