అత్యవసర సమయంలో రక్తదానం చేసిన స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్...
ఆదిలాబాద్ , పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గ్రామానికి చెందినలో నిరుపేద కెర్భ అనే ఆదివాసి రైతు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత కొన్ని రోజుల నుంచి రిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చికిత్సలు చేయించుకుంటున్న అతనికి శరీరంలో ఉన్న రక్తం మూడు గ్రాములకు పడిపోవడం తో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వ్యక్తికి ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా,ఈ విషయం స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారింగుల ప్రణయ్ దృష్టికి రావడంతో సత్వరమే మానవత్వం తో ముందుకు వచ్చి సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక రిమ్స్ లో అత్యవసర సమయంలో ఓ పాజిటివ్ రక్తం దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో రక్తహీనత ఉన్న వ్యక్తులకు రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని, రక్త హీనతతో బాధపడుతున్న వారికి యువకులు ముందుకు వచ్చి రక్త దానం చేస్తే వారి కుటుంబాలను కాపాడినట్లు అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ రక్తదానంతో కలిపి ఇప్పటివరకు 20వ సారీ రక్తదానం చేయడం అందులో ఆదివాసీ రైతుకు రక్తదానం చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆదివాసులకు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇంకా ఎవరికైనా ఆదివాసులకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి తమ దృష్టికి తీసుకువస్తే తన వంతు సహాయం చేస్తానని హామీ పేర్కొన్నారు. అనంతరం రక్తదానం చేసిన వెంటనే రోగి కి డాక్టర్లు రక్తం ఎక్కించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రిమ్స్ డాక్టర్లు పేర్కొన్నారు. రోగి ఆరోగ్యం మెరుగుపడటంతో వారి కుటుంబీకులు స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారింగుల ప్రణయ్ ను నువ్వు మా ఆదివాసి బిడ్డ అని, ఆ దేవుడు మా కష్టాలు తీర్చడానికి పుట్టినట్టు ఉందని, మా కష్టాన్ని తెలుసుకొని మా కుటుంబాన్ని కాపాడిన దేవుడు అని అతనిని సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ సింగ్, పోతివాల్ లోకండే, అనిల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment