Followers

సీతమ్మధారలో కొత్తగా ప్రారంభించనున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ను పరిశీలించిన కె.కె.రాజు

 సీతమ్మధారలో కొత్తగా ప్రారంభించనున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ను పరిశీలించిన కె.కె.రాజు

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు సీతమ్మధార లో బుధవారం నుండి కొత్తగా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో విశాఖ సమన్వయకర్త కె కె రాజు మరియు 14 వార్డు కార్పొరేటర్ కఠారి అనిల్ కుమార్ రాజు, ఈరోజు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను  సీతమ్మధార మారుతీ నగర్ లో గల తమిళ్ కళయ్ మందిర్ లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానికులంతా ఉపయోగించుకుని కరోనా నిర్మూలనకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏ.ఈ, రహీమ్, వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...