మూడు లక్షల రూపాయల కర్ణాటక మద్యం స్వాధీనం
చిత్తూరు జిల్లాలో రోజురోజుకు మద్యం అక్రమ రవాణా పెరిగిపోవడంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్ పి ఎస్.రేవంత్ రెడ్డి గార్లకు వచ్చిన సమాచారం మేరకు చిత్తూరు డి ఎస్ పి సుధాకర్ రెడ్డి మరియు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. బాలయ్య గార్ల ఆధ్వర్యంలో చిత్తూరు - వేలూరు రోడ్డు మార్గంలో ఉన్న మాపాక్షి క్రాస్ వద్ద చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కె. నాగ సౌజన్య మరియు తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా మద్యాన్ని తరలిస్తున్న కారును, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా కర్ణాటక రాష్ట్రం నుండి మద్యం అక్రమంగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున సరఫరా చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్లు గా తెలిసేది. వాహనంలో సుమారు మూడు లక్షల రూపాయల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మద్యాన్ని పట్టుకోవడం లో కీలక పాత్ర పోసించిన స్పెషల్ బ్రాంచ్ మరియు తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బందిని రివార్డులతో అధినందిచారు. ముద్దాయిలు జీడి నెల్లూరుకు మండలం, నరసింగా పురం గ్రామం చెందిన పి. తులసి, ఎం, పవన్ కళ్యాణ్, చిత్తూరు కొండారెడ్డిపల్లి కి చెందిన ఏ. శ్రీనివాసులు లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
No comments:
Post a Comment