సమాదుల తోట స్థల కేటాయింపునకు కృషి...
సామర్లకోట పట్టణంలో క్రైస్తవుల సమాదులతోటకు స్థలం లేనందున అధనంగా స్థలాన్ని కేటాయించేందుకు గానూ త్వరలో కౌన్సిల్లో తీర్మానించి స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేయనున్నట్టు వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు దవులూరి సుబ్బారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉభా జానామోజెన్లు హామీ ఇచ్చారు. పట్టణంలో యేసుక్రీస్తు పునరుత్థాన పండుగ సందర్భంగా స్థానిక ఆంద్ర బాప్టిస్టు చర్చిలో జరిగిన ప్రత్యేక ఆరాధన కార్యక్రమంలో వారు ముఖ్య అతిధులుగా విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ సమాదుల తోటలో స్థలాలు సమాదులతో నిండుకుని ఉన్న కారణంగా స్థలం కొరత ఉన్నట్టు ఎంతో కాలంగా తమ దృష్టికి వస్తున్నందున ఈ సారి కౌన్సిల్లో అతి త్వరలోనే దీనిపై చర్చించి తీర్మానించి అదనంగా స్థలాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సజీవుడైన యేసుక్రీస్తును ఆరాదించు కునేందుకు సమాదుల తోటను అతి సుందరంగా తీర్చిదిద్ది ఏ కోణంలోనూ ఇది శ్మశానవాటిక అనే భావన రాకుండా ఎంతో సుందరంగా తీర్చి దిద్దడంతో పాటు కుటుంబాలు పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులందరితో వెళ్ళి ప్రార్థనలు నిర్వహించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. క్రైస్తవ మనోభావాలు దెబ్బతినకుండా, మరణించిన వారికి నిర్మించే సమాదుల కొలతల విషయంలో ప్రత్యేక నిబందనలు పాటించే విధంగా రానున్న రోజుల్లో ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. అయితే సమాదుల తోట స్థల సమస్యను పరిష్కరిస్తామని వారు ఈ సందర్భంగా క్రైస్తవ ప్రజలకు హామీ ఇచ్చారు. అంతర్జాతీయ వర్తమానికులు డా. ఈలి సత్య సువార్త రాజు నాయకులు, వైస్ చైర్మన్, కౌనిర్లరందరి క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా పట్టణ, మండల పరిధిలోని అన్ని చర్చిల్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు యేసు పునరుత్థాన పండుగ ఆరాధనలు భక్తి శ్రద్ధలతో జరుపుకుని ఆనందించారు. ఈ కార్యక్రమాల్లో వార్డు కౌన్సిలర్లు పిట్టా సత్యన్నారాయణ, పాలిక కుసుమచంటిబాబు, జట్లా మోహన్, పాగా సురేష్ కుమార్, సేపేని సురేష్ లు, మండల పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు పాము సువర్ణకుమార్, కార్యదర్శి సూర్యోదయ కుమార్, మోహనరావు, సెంటినరీ, లూథరన్ సంఘాల దైవజనులు, ఇతర పాస్టర్లు మాట్లాడారు. ఈ సమాదుల పండుగ కార్యక్రమంలో ఇంకా బాప్టిస్టు ఫీల్డ్ కౌన్సిల్ అధ్యక్షులు సల్లూరి కళ్యాణ్, వైకాపా నాయకులు దూది, రాజబాబు, ఇరుసుమళ్ళ సాయి, మాగావు గోపి, సంగినీడి భావన్నారాయణ, చర్చి నాయకులు బిఎస్ వందనం, టి సూర్యారావు, టి అన్నపూర్ణ డానియేలు, అధిక సంఖ్యలో క్రైస్తవ కుటుంబాలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment