డా.బాబు జగజీవన్ రాం సేవలు మరవలేనివి...
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్
ఉట్నూర్, పెన్ పవర్అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో మాజీ ఉప ప్రదానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 113 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఉట్నూర్ మండలకేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌక్ లో అదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, పెసా కో ఆర్డినెటర్ వెడ్మ బొజ్జు, ఉట్నూర్ అర్.డి.ఓ జాడి రాజేశ్వర్ లు ముఖ్య అతిథిగా పాల్గొని బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ జడ్పి చైర్మెన్ రాథోడ్ జనార్థన్ మరియు పెసా కో ఆర్డినేటర్ వెడ్మ బొజ్జ లు మాట్లాడుతు భారతదేశంలోనే అత్యున్నతమైన స్థానంలో నిలిచి దేశ ప్రజలందరీకి సేవలందించిన మహానీయుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం అని నేడు వారి జయంతి సందర్భంగా ఉట్నూర్ లో బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులార్పించడం జరిగిందని, దేశ ప్రజలందరు కూడా వారి సేవలను కొనియాడుతు వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ టి.అర్.ఎస్.మండల అద్యక్షుడు సింగారే భారత్, దళిత సంఘాల నాయకులు బిరుదుల లాజర్, లింగంపల్లి చంద్రయ్య, అరికిల్ల అశోక్, బండి విజయ్, ఖానాపూర్ నియేజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి భారత్ చౌహాన్, నార్నూర్ మాజీ జడ్పీటిసి బ్రిజ్ లాల్, ఉట్నూర్ మాజి సర్పంచ్ బోంత అశరేడ్డి, స్థానిక నాయకులు ఆడే ప్రకాష్, దిలేష్ చౌవన్, జిల్లపెల్లి రాజన్న, కుటికల ఆగష్టీన్, కోల్లూరి లింగన్న, కోమ్ము బాపురావ్, చోప్పదండి కాంతారావ్, మహెందర్ దుర్గే తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment