బత్తిన సుబ్బారావు జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి
కోరుకొండ, పెన్ పవర్మాజీమంత్రి , నిస్వార్థ సేవా భిలాషి బత్తిన సుబ్బారావు జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని వైసిపి రూరల్ కోఆర్డినేటర్ నాగేశ్వర్ విజ్ఞప్తి చేశారు. రూరల్ మండలం కోలమూరు గ్రామంలో సోమవారం బత్తిన సుబ్బారావు 25 వ వర్ధంతి సభ బత్తిన చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగేశ్వర్ మాట్లాడుతూ, సుబ్బారావు నిస్వార్థ సేవ ,వ్యక్తిత్వం ,జీవనశైలి తో రాష్ట్ర ,జాతీయ స్థాయిలో గొప్ప పేరు గడించారని అన్నారు. ఇప్పటివరకు ఏ రాజకీయనాయకుడు చేయని విధంగా రైతాంగానికి సాగునీరు పేదలకు ళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత బత్తిన సుబ్బారావుదే నన్నారు. సభాధ్యక్షుడు చంద్రమౌళి మాట్లాడుతూ చంద్రబాబు మాట్లాడుతూ..పేదరికంలో పుట్టి రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగి రాష్ట్ర మంత్రిగా నిస్వార్థ సేవలందించిన బత్తిన సుబ్బారావు పేరు ప్రఖ్యాతలు ఈనాటికీ మరువ లేమన్నారు . ఎంతో మంది ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పని చేసి స్థానిక రైతుల కోసం ఆరోజుల్లోనే వెంకటనగరం పంపింగ్ స్కీం అమలు చేసిన నిస్వార్థపరుడని న్నారు. తొలుత బత్తిన సుబ్బారావు విగ్రహానికి ,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసిపి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వైసిపి నాయకులు ఆకుల వీర్రాజు, తాడికొండ విష్ణుమూర్తి, పడాల ప్రసాదు, ఆలీ విజయ్ కుమార్,సభాధ్యక్షులు బత్తిన చంద్రమౌళి,దొడ్డే రాఘవులు, ఉల్లంగి నవీన్,ఉల్లంగి జానుబాబు,ఉల్లంగి చంద్రయ్య,బత్తిన కొండబాబు, బత్తిన రమణ, బత్తిన నాగరాజు,నూక తట్టి బ్రహ్మయ్య, జి.కన్నయ్య ,మద్ద ఏసు, మద్ద సూరి,పోలినాటి గంగాధర్,మెల్లం బచ్చయ్య , చిన్నం విక్టర్, బత్తిన గంగరాజు, నూక తోట్టి నూకతట్టి రూపులు, కన్నయ్య గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment