మంచిర్యాల పట్టణంలో ఐదు రోజులు సంపూర్ణ బంద్.
-చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ మంచిర్యాల.
మంచిర్యాల , పెన్ పవర్మంచిర్యాల పట్టణంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వ్యాపిస్తూ, పట్టణ ప్రజలను వ్యాపారులను అనారోగ్యానికి గురి చేస్తున్నందున తప్పనిసరి పరిస్థితులలో మే ఒకటి నుండి మే 5 వరకు ఐదు రోజుల సంపూర్ణ బంద్ ప్రకటించడం జరిగిందని చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్షుడు గుండా. సుధాకర్ గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ సుధాకర్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ ప్రజల మరియు వ్యాపారస్తుల క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ విషయంపై పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థల ప్రతినిధులను సంప్రదించి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. మే ఒకటి నుండి మే 5 వరకు మంచిర్యాల పట్టణంలో అత్యవసర సర్వీసులు అయినా మెడికల్ షాప్స్, పాలు, పండ్లు, కూరగాయలు, చికెన్ సెంటర్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు.ప్రజలు, వినియోగదారులు, అందరూ వ్యాపారస్తులు ఈ ఐదు రోజులు పూర్తి బంద్ కు సహకరించగలరని చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్ష, కార్యదర్శులు గుండ సుధాకర్, ఇరుకుల్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment