కుత్బుల్లాపూర్ జంట సర్కిల్లలో మేయర్ ఆకస్మిక పర్యటన..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్
నగర మేయర్ ఆకస్మిక పర్యటన పారిశుధ్య పనులను పరిశీలించి తగు సూచనలు చేసిన మేయర్.. కుత్బుల్లాపూర్ మరియు గాజులరామారం జీహెచ్ఎంసి జంట సర్కిల్లలో హైదరాబాదు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేపట్టి అధికారులకు తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. సానిటేషన్ సిబ్బంది యొక్క హాజరు పట్టికను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ తనిఖీ లో జంట సర్కిల్ల ఉప కమిషనర్ లు రవిందర్ కుమార్, మంగతాయారు,,ఏఎంహెచ్ఓలు సానిటరీ సుపెర్వైజర్ లు, సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment