భక్తిశ్రద్ధలతో గుంటి గంగమ్మ అమ్మవారి తిరునాళ్లు.
పెన్ పవర్, తాళ్ళూరు
తాళ్లూరు మండలం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుంటి గంగా భవానీ అమ్మవారి 96 వార్షికోత్సవం తిరునాళ్లు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూనే అమ్మవారి ని దర్శించుకుని పూజలు చేశారు.బుధవారం తెల్లవారుజామున ఆలయ పూజారులు అమ్మవారికి అభిషేకం మహానైవేద్యం నివేదన చేశారు.గంగమ్మ అమ్మవారికి భక్తులు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం బహుళ విధియ నాడు అత్యంత వైభవంగా తిరునాళ్లు నిర్వహిస్తారు.రెండు సంవత్సరాలు నుంచి కరోనా నేపథ్యంలో విద్యుత్ ప్రభలు,సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుకు అధికారులు అనుమతించలేదు.
No comments:
Post a Comment