గెలుపే లక్ష్యంగా పోరాడుదాం...
పెన్ పవర్, ఆలమూరు
ఆలమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నుండి ఎంపీటీసీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు అన్నీ స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంగా ముందుకు వెళతామని పెనికేరు తెలుగుదేశంపార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని యనమదల స్వాతి తెలియజేశారు. మండల పరిధి కలవచర్ల, పెనికేరు గ్రామాల్లో ఆమె తన భర్త శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమిష్టిగా మండలంలోని అందరు అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనా శ్రీను (దత్తుడు),కుడిపూడి వెంకట్రావు (కొండ) పలువురు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment