గిరిజన ఆశ్రమాల్లో మెనూ అమలు పై పాడేరు పి ఓ ఆగ్రహం
పెన్ పవర్, విశాఖపట్నం
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు జరగడం లేదని పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజామల ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తమ కార్యాలయంలో జరిగిన ఏ టి డబ్ల్యూ లు మండల విద్యాశాఖ అధికారులు హెచ్ ఎం లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ ఉంటే నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ గిరిజన ఆశ్రమాల్లో అమలు జరగడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. అధికారులు పర్యటనకు వస్తున్న సమయాల్లో మెనూ కాస్త మెరుగ్గా ఉంటుందని అధికారుల హడావుడి లేని సమయంలో ఆశ్రమాల్లో మెనూ అన్న పదం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. గిరిజన ఆశ్రమాల్లో మెనూ అమలు జరిగే ఈ విధంగా చూడాల్సిన బాధ్యత ఏ టి డబ్ల్యూ హెచ్ ఎం లు ఎం ఈ వో లు బాధ్యత వహించాలని పి ఓ అన్నారు. ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేసిన చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మఒడి విద్యా కానుక అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మనబడి మా బడి నాడు నేడు పథకం నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. నాడు నేడు పనులు నిర్లక్ష్యం చేసిన అనంతగిరి మండలం లక్ష్మీపురం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ వెంకట్రావు సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. అరకు మండలం బళ్ళు కూడా పాఠశాల పనులు రష్ నెల 18 నాటికి పూర్తి చేయకుంటే అక్కడి హెచ్ఎం పై కూడా చర్యలు తప్పవన్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో రైతు భరోసా ఆర్వార్ పట్టాలు పొందిన వారి వివరాలు గిరి భూమిలో నమోదు చేయాలని మండల తహశీల్దార్లకు ఆదేశించారు. సర్వేయర్లు వీఆర్వోలు తక్షణం గిరి భూమి నమోదు కార్యక్రమం చురుకుగా చేయాలన్నారు. తహసీల్దార్లు ఎంపీడీవోలు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ అన్నారు.
No comments:
Post a Comment